డీఎఫ్‌సీసీఐఎల్‌, న్యూదిల్లీలో 1572 పోస్టులు

న్యూదిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్ర‌భుత్వ రంగ సంస్థ డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్‌) ఎగ్జిక్యూటివ్‌, టెక్నీషియ‌న్‌, ఎంటీఎస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివరాలు..... * మొత్తం పోస్టుల సంఖ్య‌: 1572 1) ఎగ్జిక్యూటివ్‌: 327 అర్హ‌త‌: స‌ంబంధిత బ్రాంచుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. 2) జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నీషియ‌న్‌): 349 అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతోపాటు సంబంధిత ట్రేడులో రెండేళ్ల కాల‌వ్య‌వ‌ధి గ‌ల అప్రెంటిస్‌షిప్‌/ ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. 3) ఎంటీఎస్ (మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌): 896 అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతోపాటు సంబంధిత ట్రేడులో ఏడాది వ్య‌వ‌ధి గ‌ల అప్రెంటిస్‌షిప్‌/ ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. వ‌య‌సు: 18-33 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. ఎంపిక‌: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్‌, సైకో టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామ్ ద్వారా. ప్రాథ‌మికంగా నిర్ణ‌యించిన ప‌రీక్ష తేది: అక్టోబ‌రు 1 నుంచి 5 ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు రూ.900, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు రూ.700, ఎంటీఎస్ పోస్టుల‌కు రూ.500. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 01.08.2018 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.08.2018 Website