TS panchayati raj act imp points -2018

ముఖ్యమైన అంశాలు:- తెలంగాన శాసన సభ మార్చి 29,2018 న కొత్త చట్టాన్ని ఆమోదించింది .
• ఉమ్మడి గవర్నర్ మార్చి 30,2018 న ఆమోద ముద్ర వేశారు .
• మార్చి 30,2018 న తెలంగాణ ప్రభుత్వం గెజిట్ లో నోటిఫై చేసింది .
• ఏప్రిల్ 18,2018 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది .
• రిజర్వేషన్లు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కాకుండా ప్రతి పదేళ్ళకు ఒకసారి రొటేట్ అవుతాయి .
• తెలంగాణ పంచాయితీ చట్టం లోని 8 వ షెడ్యూల్ లో గ్రామాలు గుర్తించబడతాయి .
• ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభ ఉంటుంది .
• ప్రతి రెండు నెలలకు ఒక సారి గ్రామ సభ సమావేశం కావాలి .
• అనగా సంవత్సరానికి 6 సార్లు సమావేశం కావాలి .
• ఆరు సమావేశాలలో కనీసం రెండు సమావేశాలు మహిళలు ,వృద్ధులు ,అణగారిన వర్గాల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి.
• సర్పంచ్ ,వార్డ్ సభ్యుల పదవులకు మహిళల రిజర్వేషన్ నిర్వహించడానికి డ్రా తీయాలి .
• గ్రామ సభ కోరం కనిష్టంగా 50 మంది ,గరిష్టంగా 400 మంది సభ్యులు ఉండాలి .
• 100% మంది ఎస్టీలు ఉన్న గ్రామాలను ఎస్టీలకే రిజర్వ్ చేయాలి
• వార్డు సభ్యులు కనిష్టంగా ఐదుగురు ,గరిష్టంగా 21 మంది సభ్యులు ఉండాలి .
• సర్పంచ్ పదవీ కాలం 5 సంవత్సరాలు .
• సభ్యులు నేరుగా గ్రామ ఓటర్ల చేత వార్డు ప్రాతిపదికన రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నిక అవుతారు .
• వెనకబడిన తరగతులకు 34% రిజర్వేషన్ లు ఉంటాయి .
• రెవెన్యూ డివిజనల్ అధికారి వార్దుల రిజర్వేషన్ ను నిర్ధారించగా కమీషనర్ వార్డులను విభజిస్తారు .
• మహిళలకు మొత్తం స్థానాలలో 50% మించి కూడా అన్ని వర్గాలకు రిజర్వేషన్ లు ఉంటాయి .
• ప్రతి గ్రామంలో 4 స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి .
• సర్పంచ్,ఉప సర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ ఉంటుంది .
• గ్రామ పంచాయితీని ఏర్పాటు చేయాలన్న ,విభజించాలన్న అప్ గ్రేడ్ చేయాలన్నా అది శాసన సభ చట్టం ద్వారానే జరగాలి.
• గ్రామ కార్యదర్శి గ్రామంలోనే నివాసం ఉండి గ్రామ పంచాయితీ రికార్డులను నిర్వహించాలి.
• తెలంగాణలో మొత్తం గ్రామ పంచాయితీలు -12,751
• గ్రామ సభ నిర్వహించడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు .
• గ్రామ సభ సమావేశాలకు ఏజెండాను తయారు చేసేది .- పంచాయితీ సెక్రెటరీ
• గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహించేది - గ్రామ సర్పంచ్ ,ఒకవేళ సర్పంచ్ అందుబాటులో లేనప్పుడు ఉప సర్పంచ్ .
• ఒక వేళ వీరిద్దరూ అందుబాటులో లేనప్పుడు వార్డు సభ్యులు అందరూ ఎన్నుకున్న వ్యక్తి అధ్యక్షత వహించును .
• ప్రతి వార్డులోని రిజిస్తార్డ్ ఓటర్స్ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు .
• ఏజెన్సీ,మైదాన ప్రాంత గిరిజన పంచాయితీలలో సర్పంచ్ పదవులలో 100% ,వార్డు పదవులలో 50% ఎస్టీలకే కేటాయించాలి .
• ఒక వేళ సాధారణ ఖాళీలు ఏర్పడితే పంచాయితీ సెక్రెటరీ 15 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు సమాచారం ఇవ్వాలి .
• ఫలితంగా కమీషన్ వారు 4 నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తారు .
• సర్పంచ్ ను తొలగించే అధికారం జిల్లా కలెక్టర్ కు కలదు .
• జిల్లా పంచాయితీ అధికారికి ప్రతి నెలకు కనీసం 5 గ్రామ పంచాయితీలను తనీఖీ చేయాలి.
• జడ్పీ సభ్యునిగా పోటీ చేసే వ్యక్తి 21 సంవత్సరాల వయస్సు కలిగి ,జడ్పీ పరిధిలో ఓటు హక్కుని కలిగి ఉండాలి .